![]() |
![]() |

నెత్తి మీద కుండల్ని పెట్టుకుని బాలన్స్ చేస్తూ డాన్స్ చేసి చూపించారు రాధ, సదా. ఈ శనివారం ఎపిసోడ్ "నీతోనే డాన్స్" లో ఒక్కో జోడి చేసిన పెర్ఫార్మెన్స్ ఒక్కోలా ఇరగదీసింది. ఫైనల్ గా మూడు జంటలు వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసాక.. శ్రీముఖి ఒక కొంటె టాస్క్ ఇచ్చింది. లేడీ కంటెస్టెంట్స్ నెత్తి మీద కుండల్ని పెట్టుకుని లైట్ గా డాన్స్ స్టెప్స్ వేయాలని చెప్పింది. అలాగే వాళ్ళందరి నెత్తి మీద వాళ్ళ వాళ్ళ హజ్బెండ్స్ వచ్చి భార్యల నెత్తి మీద కుండల్ని బాలన్స్ అయ్యేలా నిలబెట్టారు. ఇంకా కావ్య నెత్తి మీద పెట్టుకున్న కుండల్లో ఒక కుండ పగిలిపోయింది. అంజలి, నీతూ కొన్ని డాన్స్ స్టెప్స్ వేశారు. ఐతే అంజలి కుండల మీద చేయి పెట్టుకుని డాన్స్ చేసింది. నీతూ మాత్రం కుండల్ని బాలన్స్ చేస్తూ వాటిని చేతులతో పట్టుకోకుండానే డాన్స్ స్టెప్స్ లైట్ గా వేసింది. దాంతో శ్రీముఖి నీతూ విన్నర్ అని అనౌన్స్ చేసింది.
తర్వాత రాధ, సదాని స్టేజి మీదకు పిలిచి కుండల్ని పెట్టుకుని డాన్స్ చేయాలనీ చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా బాలన్స్ గా నెత్తి మీద పెట్టుకుని డాన్స్ చేశారు. ఐతే సదా నెత్తి మీద కుండ పడిపోయింది కానీ రాధ మాత్రం "ఊ అంటావా మావా" సాంగ్ కి కుండతోనే డాన్స్ చేశారు. ఫైనల్ గా వాళ్ళను చూసాక తరుణ్ మాష్టర్ కూడా వచ్చి నెత్తి మీద కుండ బాలన్స్ చేస్తూ "ఉట్టి మీద కూడు " సాంగ్ కి డాన్స్ స్టెప్స్ వేశారు.
ఇక ఈ మూడు జోడీస్ లో ఈ వీక్ బెస్ట్ పెర్ఫార్మర్ గా కావ్య-నిఖిల్ నిలిచారు. వాళ్లకు గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ వచ్చింది. ఇలా ఈ శనివారం ఎపిసోడ్ కొంచెం కారంగా కొంచెం గారంగా పూర్తయ్యింది.
![]() |
![]() |